భువనగిరి కిల్లా పై మంటలు

1888చూసినవారు
భువనగిరి ఖిల్లాపై గురువారం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. కోట మధ్యలోని పీనిగల కొట్టం పరిసర ప్రాంతాల్లో మంట చెలరేగడంతో దట్టమైన పొగ ఆవరించింది. ఎన్నికల నామినేషన్ సందర్భంగా అభ్యర్తుల అనుచరులు కాల్చిని బాణాసంచా కారణంగా లేదా పర్యాటకులు, గుర్తుతెలియని వ్యక్తులు సిగిరెట్ కాల్చి పడవేయడంతో మంట అంటుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు మంట కిందికి విస్తరిస్తుందన్న భయాందోళనకు గురయ్యారు.