యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. బుధవారం వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు, ప్రధాన ఆలయంలోని కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ముఖ మండపంలో 108 కలశాలకు పూజలు జరిపారు.