యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలుర హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.