యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి వారికి అష్టోత్తర శతకటాభిషేకంతో పాటు ఆలయ వేద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొండ కింద గల స్వామి వారి పాదాల చెంత నుండి గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ప్రారంభించారు.
స్వామి వారి గిరిప్రక్షణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.