యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం గోస్కొండ గ్రామంలో బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, బిజెపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.