మత్స్యాద్రి వేములకొండ మండలంగా ప్రకటించాలని నిరసన

841చూసినవారు
మత్స్యాద్రి వేములకొండ మండలంగా ప్రకటించాలని నిరసన
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలాన్ని విభజించి మత్స్యాద్రి వేములకొండ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ 11వ రోజు వేములకొండ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేములకొండ మండలాన్ని ఏర్పాటు చేస్తే రవాణా పరంగా 18 కిలోమీటర్ల దూరం తప్పుతుందని, చుట్టుపక్కల గ్రామాలకు కేంద్రంగా ఉండి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సామ రాంరెడ్డి, ఎలాగందుల అంజయ్య, బోడ బాలయ్య, జక్కల మత్స్యగిరి, ఎలాగందుల రవీందర్, మార్కండేయ, కడిగాళ్ల లింగయ్య, బరిశెట్టి పద్మయ్య, అకీలపక్షాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్