సోమవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల జీతాల పెంపు మరియు పెర్మనెంట్ చెయ్యాలని గ్రామపంచాయతీ సిబ్బంది నిర్వహిస్తున్నటువంటి సమ్మెకు ధర్మ సమాజ్ పార్టీ మండల నాయకులు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సంజీవ్ మహారాజ్ మాట్లాడుతూ కార్మికులు కోరే న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.