సుదీర్గకాలంగా 40సం. వలిగొండ సర్పంచ్ గా రామన్నపేట సమితీ ప్రెసిడెంట్ గా సేవలందించిన కుంభం రమణా రెడ్డి 22వ వర్దంతి కార్యక్రమం వలిగొండ పట్టణంలో శనివారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పూలమ్మల వేసి నివాళులర్పించారు. అనంతరం వలిగొండ మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.