కుమారుడికి ఐఐటీ సీటు, జాయిన్ చేసి వస్తూ మృతి
మధ్య ప్రదేశ్లోని భోపాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటకు చెందిన బత్తి వెంకటనరసింహా రెడ్డి మృతి చెందాడు. తన కుమారుడికి భోపాల్లోని ఐఐటీలో సీట్ రావడంతో జాయిన్ చేసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. మృతుడు యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.