వైసీపీ విజయం.. జగన్ రెండోసారి సీఎం: సజ్జల

36839చూసినవారు
వైసీపీ విజయం.. జగన్ రెండోసారి సీఎం: సజ్జల
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా మళ్లీ రాష్ట్రంలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు. జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. ఎన్ని కూటములు వచ్చినా జగన్ విజయాన్ని ఆపలేరన్నారు.

సంబంధిత పోస్ట్