వామపక్ష యోధుడు ఏచూరి.. రాజకీయ ప్రస్థానం ఇలా!

61చూసినవారు
వామపక్ష యోధుడు ఏచూరి.. రాజకీయ ప్రస్థానం ఇలా!
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి (72) కన్నుమూశారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతగా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఎంలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో ఏచూరి కూడా అరెస్ట్ అయ్యారు. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరాత్‌తో కలిసి జేఎన్‌యూను వామపక్ష కోటగా మార్చారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో ఏచూరి పోరాటం ఢిల్లీకి చేరింది. 1992లో పార్టీ పొలిట్‌బ్యూర్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆ పదవిలోనే కొనసాగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్