సీతారాం ఏచూరి ప్రస్థానం ఇదే!

68చూసినవారు
సీతారాం ఏచూరి ప్రస్థానం ఇదే!
సీతారాం ఏచూరి.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు. 1952 ఆగస్టు 12న చెన్నైలో సర్వేశ్వరం సోమయాజులు, కల్పకం దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్ ఉద్యోగం చేశారు. తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. సీపీఎంలో 1992 నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్‌లో ఆయన ప్రాథమిక విద్య కొనసాగింది. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ చేశారు. జేఎన్‌యూలో ఎంఏ ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్