'నువ్వని ఇది నీదని' సాంగ్ లిరిక్స్

68చూసినవారు
'నువ్వని ఇది నీదని' సాంగ్ లిరిక్స్
నువ్వని ఇది నీదని
ఇది నిజమని అనుకున్నావా
కాదుగా నువ్వనుకుంది
ఇది కాదుగా నువ్వేతికింది
ఏదని బదులేదని
ఒక ప్రశ్నల నిలుచున్నావా
కాలమే వెనుతిరగనిది
ఇవ్వదు నువ్వడిగినది

ఏ వేలూ పట్టుకుని
నేర్చేదే నడకంటే
ఒంటరిగా నేర్చాడా ఎవడైనా
ఓ సాయం అందుకొని
సాగేదే బ్రతుకంటే
ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా

పదుగురు మెచ్చిన
ఈ ఆనందం
నీ ఒక్కడిదైనా
నిను గెలిపించిన ఓ చిరునవ్వే
వెనుకేయ్ దాగేనా

నువ్వని ఇది నీదని
ఇది నిజమని అనుకున్నావా
కాదుగా నువ్వనుకుంది
ఇది కాదుగా నువ్వేతికింది
ఏదని బదులేదని
ఒక ప్రశ్నల నిలుచున్నావా
కాలమే వెనుతిరగనిది
ఇవ్వదు నువ్వడిగినది


ఓహ్ ఊపిరి మొత్తం
ఉప్పెనలా పొంగిందా
నీ పయనం మల్లి
కొత్తగా మొదలయ్యిందా
ఇన్నాళ్లు ఆకాశం ఆపేసిందా
ఆ ఎత్తే కరిగి
నేలెయ్ కనిపించిందా
గెలుపై ఓ గెలుపై
నీ పరుగెయ్ పూర్తయినా
గమ్యం మిగిలాయి ఉందా

రమ్మని నిను రమ్మని
ఓ స్నేహమే పిలిచిందిగా
ఎన్నడూ నిను మరువనిది
ఎప్పుడు నిను విడువనిది
ఓహ్ ప్రేమని నీ ప్రేమని
నీ కోసమే దాచిందిగా
గుండెల్లో గురుతయ్యినది
గాయమై మరి వేచినది
లోకాలేయ్ తలవంచి
నిన్నే కీర్తిస్తున్న
నువ్ కోరే విజయం వేరే ఉందా
నీ గుండె చప్పుడుకీ
చిరునామా ఎదంటేయ్
నువ్ మొదలయ్యినా
చోటుని చూపిస్తుందా
నువ్వొదిలేసిన నిన్నలలోకి
అడుగేయ్ సాగేనా
నువ్ సాధించిన సంతోషానికి
అర్ధం తెలిసేనా

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్