అధికారం మీకు ఉండొచ్చు.. కానీ ప్రజల అభిమానం కేసీఆర్‌కు ఉంది: KTR

71చూసినవారు
అధికారం మీకు (రేవంత్ రెడ్డి) ఉండొచ్చు.. కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్ కు ఉన్నదని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ సభలో ఆయన మాట్లాడుతూ.. 'ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు. 6 గ్యారంటీలు అని చెప్పి, 420 హామీలు అని చెప్పి దొంగమాటలు చెప్పి గెలువచ్చు. ఏరోజుకైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ హిమాలయాలంత ఎత్తులో ఉంటే.. కనీసం నువ్వు ఆయన కాలి గోటికి కూడా సరితూగని స్థానంలో ఉంటావు' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్