యంగ్ హీరో విజయ్ దేవరకొండతో భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ సెల్ఫీ దిగాడు. వీరిద్దరి కలిసి ఒకే ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా.. విజయ్‌ని చూసిన తిలక్ వర్మ అతడితో కలిసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మిమ్మల్ని ఫ్లైట్‌లో కలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం అన్నా.. అంటూ తిలక్ తన ఇన్‌స్టాలో రాసుకోచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.