TG: కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాకేంద్రానికి సంబంధించిన మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన చాకలి చింటు (27) అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ. 85 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.