AP: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది పార్టీలో కీలక నేతలు టీడీపీ, జనసేన పార్టీల కండువా కప్పుకున్నారు. తాజాగా చిలకలూరిపేటకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వైసీపీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. విడదల రజినీకి వైసీపీలో ప్రాముఖ్యత ఇస్తుండటంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రాజశేఖర్ స్పందించాల్సి ఉంది.