మహా కుంభమేళాలో పూసలమ్ముతూ సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మోనాలిసాకు మరో అదృశ్యం కలిసొచ్చింది. ఈ నెల 26న నేపాల్‌లో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆమెకు ఆహ్వానం అందింది. కాగా, ఇటీవల ఆమె కేరళలోని జ్యువెలరీ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు.