జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చుకు యువకుడు బలి

55చూసినవారు
జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చుకు యువకుడు బలి
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గంగవరం మండలం కొత్తపల్లిలో జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చుకు ఓ యువకుడు బలి అయ్యాడు. ఓ రైతు తన పొలంలో జంతువులకు ఉచ్చుగా కరెంట్ తీగలను ఏర్పాటు చేశాడు. పొలానికి వెళ్లిన కార్తీక్ గమనించకుండా కరెంట్ తీగలను తొక్కడంతో అక్కడికక్కడే మరణించాడు. మరో యువకుడికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్