నడి రోడ్డులో బావను గొంతు కోసి చంపిన యువకుడు (వీడియో)

4646చూసినవారు
యూపీ ఇటావా రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. ఓ యువకుడు తన బావను కత్తితో గొంతు కోసి చంపాడు. హత్యకు ముందు వారిద్దరికీ వాగ్వాదం జరిగింది. ఏడాది క్రితం నిందితుడి సోదరి ఆ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో సోదరి భర్తను నిందితుడు పిలిపించి గొడవ పడ్డాడు. కోపంలో హత్య చేశాడు. తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని భోలు యాదవ్‌గా పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్