సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి డోలా

77చూసినవారు
సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి డోలా
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శుభవార్త చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులను ఎవరినీ తొలగించమని, వదంతులు నమ్మొద్దని సూచించారు. మహిళా పోలీసుల విషయంలోనూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్