మహారాష్ట్రలో జికా వైరస్ విస్తరిస్తోంది. తాజాగా పుణేకు చెందిన ఇద్దరికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఓ వైద్యుడితో పాటు ఆయన కూతురు వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం వారి ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఆయన రక్త నమూనాలను సేకరించి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) పంపారు. ఈ నెల 21న వైద్యుడికి జైకా వైరస్ సోకినట్లు తేలింది. వైద్యుడు పుణే నగరంలోని ఎరంద్‌వానే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.