బాకూరు-పాడేరు ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని గిరిజనుల విజ్ఞప్తి

హుకుంపేట మండలంలోని బాకూరు నుంచి పాడేరుకు వెళ్లే ఘాట్ రోడ్డు అధ్వానంగా మారింది. గత రెండు సంవత్సరాలుగా రహదారిపై గోతులు ఏర్పడి రాళ్లు తేలిపోవడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గిరిజనులు ఆదివారం వాపోయారు. ఘాట్ రోడ్డు మలుపులు ప్రమాదకరంగా మారాయని, రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్