నిరాధార వార్తలు రాయవద్దు: టీటీడీ చైర్మన్

AP: ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తనపై కొందరు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల విషయాల్లో నిరాధార వార్తలు రాయవద్దని విజ్ఞప్తి చేశారు. తొక్కిసలాట బాధితుల్లో 31 మందికి చెక్కులు అందజేశామని, మిగతా 28 మందికి మంగళవారంలోగా పంపిణీ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్