సీఎం చంద్రబాబు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను సొంతూరు నారావారిపల్లెలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల నడుమ ఆయన సంక్రాంతి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటన ఈ సాయంత్రంతో ముగిసింది. ఆయన విజయవాడకు తిరుగుపయనమయ్యారు. నారావారిపల్లెలో తన పర్యటన సందర్భంగా చంద్రబాబు అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.