రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి శుక్రవారం అన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర-2047 దార్శనిక పత్రం రూపకల్పనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే ఐదేళ్లకు జిల్లా స్థాయి దార్శనిక పత్ర రూపకల్పన కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు.