ఇబ్రహీంపట్నంలో ఇసుక త్రవ్వటం నిషిద్ధం: తహసీల్దార్ వెల్లడి

ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఇసుక రవాణాకు ఎటువంటి అనుమతులు లేవని తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఇబ్రహీంపట్నం, జూపూడి, మూలపాడు, త్రిలోచనాపురం, కోటికలపూడి, దాములూరు, గుంటుపల్లి, తుమ్మలపాలెం గ్రామాలలో ప్రభుత్వం ఇసుక రీచ్‌గా ప్రకటించలేదు మరియు తవ్వకానికి అనుమతులు లేవని చెప్పారు. ఇక్కడ ఇసుక త్రవ్వటం నిషిద్ధం అని, దానికి శిక్షార్హంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్