నేడు ఢిల్లీకి మాజీ సీఎం జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మంగళవారం ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్తారు. మూడు రోజులు అక్కడే ఉండనున్నారు. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనను నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా చేపట్టాలని వైసీపీ నిన్న పిలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్