ఎస్సీ సామాజిక భవనం నిర్మించాలి

కాట్రేనికోన మం. లక్ష్మివాడ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పాత ఎస్సీ సామాజిక భవనం ఉండే స్థలంలోనే నూతన భవనం నిర్మించాలని స్థానిక గ్రామస్థులు, ఎస్సీ యువత డిమాండ్ చేశారు. దీనిపై గురువారం వారు మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో గతంలో ఎస్సీ కమ్యూనిటీ భవనం ఉండేదన్నారు. పాఠశాల భవనం శిథిలస్థితికి చేరగా, దాంతోపాటు బాగున్న సామాజిక భవనాన్ని రెండేళ్ల క్రితం స్థానిక సర్పంచి భర్త తొలగించారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్