ఏపి ఎన్నికల పోలింగ్ పై మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 వార్డుల్లో రీ పోలింగ్ నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి వాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుమందిని చేర్చారు. ఈ పిటిషన్ ను ధర్మాసనం రేపు విచారించే అవకాశం ఉంది.