జనవరి 1 నుంచి కొత్త ఛార్జీలు.. క్లారిటీ

AP: రాష్ట్రంలో 2025 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయనే ప్రచారం సాగుతోంది. భూమి విలువలు 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. గ్రోత్ కారిడార్లు ఉన్న దగ్గర ధరలు సమీక్షించి అమలు చేయాలనే ఆలోచన ఉందని.. మార్కెట్ ధరల కంటే ప్రభుత్వం ధరలు ఎక్కువగా ఉన్న చోట సమీక్షిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్