హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

66చూసినవారు
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హిమాయత్‌నగర్‌లోని మినర్వా హోటల్‌లో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. కిచెన్‌లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో హోటల్‌లోని సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలు ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్