AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదం నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో అమరావతి మేజర్ కెనాల్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. అయితే, వారు కాలువలో కొట్టుకుపోతున్నట్లు స్థానికులు చూసి ముగ్గురిని కాపాడారు. మరో ఇద్దరు విద్యార్థులు కాలువలో కొట్టుకుపోయారు. వారిలో ఒకరు మరణించగా, మరొకరి కోసం NDRF బృందం గాలింపు చర్యలు చేపట్టింది.