దేవాలయాలపై దాడులు పెరిగాయి: పురందేశ్వరి

80చూసినవారు
దేవాలయాలపై దాడులు పెరిగాయి: పురందేశ్వరి
AP: దేవాలయాలపై దాడులు పెరిగాయని ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని అన్నారు. ఆలయాల్లో అన్యమతస్తులు పెరిగారని వెల్లడించారు. ఆదివారం జరిగిన హైందవ శంఖారావం సభలో దగ్గుబాటి పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా పురందేశ్వరి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్