పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం అంగన్వాడీలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి, 42 రోజుల సమ్మె ఒప్పందాన్ని అమలు చేయాలని, మినీ వర్కర్లకు సమాన వేతనాలు, ప్రమోషన్లు, వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.