ప్రధానమంత్రి జార్జియా మెలోని కీలక నిర్ణయం

భారత్‌కు చెందిన ఓ కార్మికుడు దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఇటలీలో తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ ఘటనను ఇటలీ పార్లమెంటులో ప్రస్తావించిన ప్రధానమంత్రి జార్జియా మెలోని.. బాధితుడి మృతిపై సంతాపం ప్రకటించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అమానవీయ చర్యకు సత్నామ్‌ సింగ్‌ బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ చర్యలకు పాల్పడిన వారిని క్రూరులుగా పేర్కొన్న ఆమె.. దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్