పూరీ జగన్నాథుడి ఆలయంపై డ్రోన్ కలకలం

ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథుడి ఆలయంపై ఆదివారం తెల్లవారుజామున డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది. ఆలయం సహా చుట్టు పక్కల ప్రాంతం ‘నో ఫ్లై జోన్‌’లో ఉండగా డ్రోన్ కనిపించడంతో ఆలయం భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ డ్రోన్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్