పొన్నకల్ పాఠశాలకు భారీగా విరాళాలు

అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామానికి చెందిన దోనూరు రంజిత్ రెడ్డి బూట్లు, సాక్సులు అందజేశారు. హేమవర్ధన్ రెడ్డి పాఠశాలకు పది కుర్చీలను, లింగారెడ్డి పాఠశాల ఆవరణలో సీసీ కెమెరా ఏర్పాటు చేసారు. గణేష్ నాయిబ్రాహ్మణ సంఘం బ్యాండ్ సెట్ ను, సాయికృష్ణ మైక్ సెట్ ను శుక్రవారం పాఠశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు హెచ్ ఎమ్ వెంకటేష్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్