పిన్నెల్లి బెయిల్‌ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

AP: అరెస్టు నుంచి రక్షణ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టులో 4 ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేశారు. దీనికి సంబంధించి పోలీసుల తరఫున స్పెషల్‌ కౌన్సిల్‌గా న్యాయవాది ఎన్‌.అశ్వినీకుమార్‌.. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు పిన్నెల్లి పిటిషన్లను తొసిపుచ్చింది.

సంబంధిత పోస్ట్