బ్రిటన్ రాజు సోదరి అన్నే ఆసుపత్రి పాలయ్యారు. 73 ఏళ్ల అన్నే తలకు గాయం అవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. బ్రిస్టల్‌లోని గాట్కాంబ్ పార్క్ ఎస్టేట్‌లో ఆదివారం సాయంత్రం అన్నే గాయపడినట్లు పేర్కొంది. దీంతో ఆమెను స్థానిక సౌత్మేడ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపింది. ఇటీవలే బ్రిటన్ రాజు చార్లెస్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే.