మాజీ ముఖ్యమంత్రి అయినా అదే భద్రత

81చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి అయినా అదే భద్రత
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్‌కు ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉందో ఓడి పోయినా ఇప్పుడూ అదే కొనసాగుతోంది. నిజానికి ఆయన ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్షనేత హోదా కూడా లేదు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా లేని స్థాయిలో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. గతంలో ఉన్న భద్రత ఎంతమాత్రం తగ్గించలేదు. జగన్‌ కాన్వాయ్‌లో రెండు అత్యాధునిక ల్యాండ్‌ క్రూయిజర్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ కార్లు ఉండగా, జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఎన్‌ఎస్‌జీ ఆధీనంలో ఉన్న చంద్రబాబుకు బుల్లెట్‌ప్రూఫ్‌ ఫార్చూనర్‌ వాహనం మాత్రమే అందుబాటులో ఉంచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్