బాల్య వివాహాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చైల్డ్ లైన్ మండల కోఆర్డినేటర్ యాదయ్య గురువారం అన్నారు. మండలంలోని కొత్లాపూర్, బూచన్పల్లి, రావులపల్లిలో బాల్య వివాహాల నిషేధంపై ర్యాలీ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిన్నతనంలో వివాహాలు చేస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయని యాదయ్య హెచ్చరించారు. బాల్య వివాహాలు చేస్తే వచ్చే సమస్యల గురించి వివరించారు.