ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఊపందుకున్నాయి. పార్టీల ముఖ్య నేతలు నేడు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నామినేషన్ వేయడానికి తన భార్య, ఆప్ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. కాగా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ నుంచి పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ పోటీ చేయనున్నారు.