కెమికల్ లారీలు అడ్డగింత.. స్టేషన్ కు తరలింపు

ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ల వద్ద కెమికల్ ట్యాంకర్, లారీని గ్రామస్తులు అడ్డుకున్నారు. గత రాత్రి రెండు లారీల్లో తీసుకొచ్చిన కెమికల్ ను మున్నేరు నీటిలో కలుపుతుండగా గ్రామస్తులు గమనించి అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్న పోలీసులు కెమికల్ లారీని స్థానిక స్టేషన్ కు తరలించారు. స్థానికుల ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్