తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు, రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొ. కోదండరాంకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించిందని రాష్ట్ర విద్యార్థి జేఏసీ నాయకులు గడ్డం ఆదాం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో విశేషంగా పనిచేసి, రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమికి పోషించారన్నారు. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్సీగా కోదండరాంకు స్థానం కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు.