మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశద్రోహమే: రాహుల్

అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన రోజునే భారత్ నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందిందంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశ స్వాతంత్ర్యం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని చెప్పారు. దేశంలో మన రాజ్యాంగ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ భావజాలం మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. 1947లో మనకు స్వాతంత్ర్యం రాలేదని చెప్పి దేశ ప్రజలను అవమానించారని దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్