ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేస్తూ పార్లమెంటులో చట్టం తీసుకురావాలని రాష్ట్ర అధ్యక్షుడు కిన్నెర సిద్ధార్థ డిమాండ్ చేశారు. గురువారం నిర్మల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీలకు 6 లక్షల రూపాయల పరిమితితో ఇస్తున్న క్రిమిలేయర్ సర్టిఫికెట్ విధానాన్ని ఎస్సీ రిజర్వేషన్లలో కూడా అమలు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.