నిర్మల్ లో బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి జన్మదిన వేడుకలు
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి 69వ జన్మదిన వేడుకలను నిర్మల్ పట్టణంలోని విశ్రాంత భవనంలో ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర నాయకులు దేవొళ్ళ గంగాధర్, న్యాయవాది దేవోళ్ల రాజు మాయవతి చిత్రపటం ముందు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. బహుజనుల రాజ్యం వస్తేనే అన్ని సమస్యలు తీరుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు బాపూరావు, గంగారం, పట్ల, బాపూరావు, నారాయణ, హరిదాసు, శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.