బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టుబడిన తెలుగు ప్రముఖులు (వీడియో)

బెంగళూరులోని ఓ ఫామ్ హౌజ్ లో బర్త్ డే వేడుకల పేరుతో హైదరాబాద్ చెందిన వాసు రేవ్ పార్టీ నిర్వహించారు. దీనికి తెలుగు నటీమణులు, ప్రముఖులు హాజరయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో 25 మందికి పైగా యువతులు, తెలుగు నటీమణులు ఉన్నట్లు సమాచారం. పలు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా పార్టీలో మంత్రి కాకాణి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు కనిపించింది. అయితే ఈ కారు తనది కాదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్