శ్రావణమాస పర్వదిన సందర్భంగా శుక్రవారం వర్గల్ మండలంలోని శ్రీ విద్యాధరి అమ్మవారు శ్రీ వరలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కలిసి రావడంతో భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు తమ పిల్లలకు అక్షర స్వీకారం చేయించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని క్షేత్రంలో అమ్మవారికి విశేష అభిషేకము, చండీహోమము, లక్ష పుష్పార్చన చేశారు.